MLA Pulivarthi Nani: చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్.. “సినిమా చూపిస్తా”..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Pulivarthi Nani: తిరుపతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చెవిరెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడతామని హెచ్చరించారు. తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. తండ్రి పేరును అడ్డం పెట్టుకుని సంపాదన చేసుకుంటూ గర్వంతో ప్రవర్తిస్తున్నారని చెవిరెడ్డి కుటుంబంపై మండిపడ్డారు. ముఖ్యంగా మోహిత్ రెడ్డి చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు నారా లోకేష్ పేరు ఎత్తితే చూస్తూ ఊరుకోమని, తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
Read Also:
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి, దందాలు అన్నింటినీ త్వరలో ప్రజల ముందుకు తీసుకువస్తామని నాని తెలిపారు. వారంలోనే చెవిరెడ్డికి “సినిమా చూపిస్తా” అంటూ రాజకీయంగా కౌంటర్ ఇచ్చారు. కొంతమంది మాటలు కొండను చూసి కుక్క మొరిగినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడని, అందుకే ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు వచ్చాయని పేర్కొన్నారు. లోకేష్‌పై విమర్శలు చేసే ముందు ఆయన పని తీరును చూడాలని సూచించారు.
ఇక చెవిరెడ్డి కుటుంబంపై మరోసారి మండిపడిన నాని, వెన్నుపోటు రాజకీయాలకు ఆ కుటుంబమే ప్రతీక అని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి, వేమిరెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారిని కూడా మోసం చేసిన చరిత్ర ఉందన్నారు. వెన్నుపోటు అంటే గుర్తుకు వచ్చేది చెవిరెడ్డి కుటుంబమేనని వ్యాఖ్యానించారు. కోట్లాది రూపాయల మద్యం డబ్బులు లెక్క పెడుతున్న వీడియోల్లో కనిపించిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తుడా వ్యవహారంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతోందని, సహకరించిన అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. దొంగ ఓట్ల కేసు త్వరలో బయటపడుతుందని, 15 ఏళ్లకే ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన ఘటనలు వెలుగులోకి వస్తాయని నాని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను ఎవరూ భయపెట్టలేరని, వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని..
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్‌ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
-
Gold Imports: బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం.. 70% తగ్గిన దిగుమతులు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..