చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి… ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదని దుయ్యబట్టారు. జగన్ హయంలో శాంతి భద్రతలు బాగున్నాయి.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.. రోడ్డు మీదే ప్రజలను నరికేస్తున్నారని రోజా తెలిపారు.
Read Also: Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో తెలుగు వారు!
లోకేష్, చంద్రబాబు వల్ల ఒక్క ఎంవోయూలు చేయలేదు.. 20 కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళి.. ఖాళీ చేతులతో వచ్చారని ఆర్కే రోజా విమర్శించారు. స్పెషల్ ఫ్లైట్, సూట్లు, బూట్లు అంటూ కోట్లు ఖర్చు పెట్టారు.. దావోస్‌లో లక్ష ఇరవై వేల కోట్లను విశాఖపట్నంలో 13.5 లక్షల కోట్లు జగన్ పెట్టుబడులు తెచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు అన్ని జగన్ అన్న తెచ్చినవేనని అన్నారు. చంద్రబాబు మత్తులో పవన్ కల్యాణ్ ఉన్నాడని దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్‌ను దావోస్‌కు చంద్రబాబు ఎందుకు తీసుకుపోలేదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఏడు నెలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. తిరుమల పవిత్రతను పాడుచేశారు.. చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానేయాలని తెలిపారు. దావోస్ పర్యటనలో ఒక్క ఎంవోయూ జరగకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు.. తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయకుండా గాలికి వదిలేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.