CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని.. 11.30 గంటలకి రేణిగుంట మండలంలోని తూకివాకంలో తిరుపతి కార్పొరేషన్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ సందర్శించననున్నారు. మధ్యాహ్నం 12.15: తిరుపతి కపిలతీర్థంలో కపిలేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ వాటాదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
Read Also: WCL 2025: మొదటి మ్యాచ్ లోనే తడపడ్డ ఇంగ్లాండ్.. 5 పరుగుల తేడాతో ఓటమి..!
ఇక, మధ్యాహ్నం 1.15 గంటలకి పోలీస్ పరేడ్ మైదానం చేరుకుని భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠానికి చెందిన మఠానికి చేరుకుని కంచి స్వాములతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరతారు.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి విజయవాడుకు తిరుగు ప్రయాణం అవుతారు.
