Vaikunta Dwara Darshanam: తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి అధికారులు ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు. రేపు అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగనున్నాయి. మొదటి 3 రోజులకు ఆన్ లైన్ లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్ల కేటాయింపు పూర్తైంది. అలాగే, జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులు నేరుగా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.
Read Also: TFCC Elections : ఛాంబర్ ఎలక్షన్స్ మన ప్యానెల్ vs ప్రొగ్రెసివ్ ప్యానల్ మధ్య తీవ్ర పోటీ
అయితే, ఎల్లుండి ఉదయం 9 గంటలకు స్వర్ణ రథంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా దర్శనం ఇవ్వనున్నారు. ఇక, డిసెంబర్ 31వ తేదీ ఉదయం 5 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరగనుంది. 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
