NTV Telugu Site icon

Tirumala: నేడు మార్చ్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల విడుదల..

Tirumala

Tirumala

ఇవాళ ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. మార్చ్ నెలలో నిర్వహించే వార్షిక తెప్పోత్సవాల టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఇక, శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శనం టికెట్ల కోటాను నేటి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రిలీజ్ చేయనున్నారు. అంగప్రదక్షిణం టోకెన్లు డిసెంబ‌రు 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. అలాగే, శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం, గదుల కోటాను డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు విడుద‌ల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్ల కోటాను డిసెంబ‌రు 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు టీటీడీ రిలీజ్ చేయనుంది.

Read Also: Crime News: వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. గుర్తించలేని స్థితిలో తల్లి, సోదరుడు!

అలాగే, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 25న 10 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు అందుబాటులో ఉంచనుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను సైతం రిలీజ్ చేయనుంది. ఇక, డిసెంబ‌రు 27న ఉద‌యం 11 గంట‌లకు.. తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదే రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటా, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో టీటీడీ ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌ సేవ‌లు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.