NTV Telugu Site icon

Tirumala Rush: భక్తులతో కిటకిటలాడుతున్న ఏడుకొండలు

Ttd Tirumala

Ttd Tirumala

తిరుమల భక్త జనసంద్రంగా మారింది. రోజూ లక్షకు తగ్గకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పైగా పడుతోంది. శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు 87,698 మంది భక్తులు. తలనీలాలు సమర్పించారు 48,804 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు అని టీటీడీ తెలిపింది.

దీంతో ఏడుకొండలపై ఎటూ చూసినా గోవింద నామస్మరణమే. భక్తులతో సందడి సందడిగా మారింది. కోవిడ్ తర్వాత మే నెలలో భారీగా భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్‌లు పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి పలు సూచనలు చేశారు. భక్తుల తాకిడి దృష్ట్యా అదనపు క్యూ లైనులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికార్లకు ఈవో ఆదేశాలు ఇచ్చారు.

ఈవో ధర్మారెడ్డి ఆదేశాలతో ఆళ్వార్ ట్యాంక్ చుట్టూ అదనపు క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ అధికారులు. వేసవి సెలవులు అయిపోవస్తున్నాయి. దీంతో భక్తులు తిరుమలకు పయనం అయ్యారు. గతంలో కోవిడ్ భయాల వల్ల దైవదర్శనాలు వాయిదా వేసుకున్నవారు తిరుమలకు ఇప్పుడు చేరుకుని, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇవాళ వజ్రకవచధారియై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. రెండేళ్ళ తరువాత జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు భక్తులును అనుమతిస్తుంది టీటీడీ. కరెంట్ బుకింగ్ విధానంలో భక్తులకు జ్యేష్ఠాభిషేకం టిక్కెట్లు విక్రయిస్తుంది టీటీడీ.

Pawan Kalyan: సంపూర్ణ మద్యనిషేధంపై పవన్ సెటైర్లు