NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం భయటపడింది. ఈ సారి ఏకంగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించే అర్చకులు బస చేసే అర్చక నిలయం ముందే క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రభోధాలు ఉన్న వాహనాన్ని నిలపడం విమర్శలకు దారితీసింది. అలిపిరి టోల్‌గేట్‌, జీఎన్‌సీ టోల్‌గేట్‌ వద్ద విజిలెన్స్ తనిఖీలు దాటుకోని వాహనం అర్చక నిలయం వద్దకు చేరుకోవడం.. ఆ వాహనాన్ని అక్కడే పార్క్ చేసి వెళ్లిపోయారు గుర్తుతెలియని వ్యక్తులు. అయినా, విజిలెన్స్‌ అధికారులు మాత్రం వాహనాన్ని గుర్తించకపోవడం.. వాహనంపై స్టికర్‌ని తొలగించే ప్రయత్నం చెయ్యకపోవడంతో విజిలెన్స్‌ అధికారుల డొల్లతనాన్ని భయటపెట్టింది.. కాగా, గతంలోనూ ఇలాంటి వైఫల్యాలు వెలుగు చూడడం.. విజిలెన్స్‌ వ్యవహారంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడిన ఘటనలు చాలానే ఉన్నాయి.. అయితే, టీటీడీ కఠినంగా ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడం విమర్శలకు దారి తీస్తోంది.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను సస్పెండ్ చేసిన కేంద్రం

Show comments