Tirumala: తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్ల విడుదల కానున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఇవాళ ఆన్లైన్‌లో విడుదల చేయనున్నారు.
IND vs NZ T20: అభిషేక్ శర్మ వన్ మ్యాన్ షో.. కివిస్ పై టీమిండియా భారీ విజయం.!
ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. నిన్న (జనవరి 21) శ్రీవారిని మొత్తం 74,056 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,517 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజున హుండీ ద్వారా రూ. 3.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
Amruta: నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
ఈ నెల 25వ తేదీన తిరుమలలో శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. రథసప్తమి నేపథ్యంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లను రద్దు చేశారు. అలాగే 25వ తేదీన ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలు, దర్శన ప్రణాళికలను ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
