NTV Telugu Site icon

TTD: ఎటువంటి అపచారం జరగలేదు.. వదంతులను నమ్మకండి..

Ttd

Ttd

TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమలలో ఏదో జరిగిందనే ప్రచారం సాగుతోంది.. అయితే, దీనిపై క్లారిటీ వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయని.. కానీ, శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని సూచించింది టీటీడీ.. సాధారణంగా బ్రహ్మోత్సవాల మునుపే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి.. వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయమని పేర్కొంది.. అయితే, అందులో భాగంగానే భిన్నమైన ద్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతలో దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం అని కొట్టిపారేశారు.. తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని భక్తులకు తెలియజేస్తున్నాం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది టీటీడీ..

Read Also: YouTube Shorts : యూట్యూబర్స్‌కి గుడ్‌న్యూస్.. షార్ట్స్‌ నిడివి పెంపు..

కాగా, ఈ రోజు సాయంత్రం 5:45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది, ఇది బ్రహ్మోత్సవాలను ప్రారంభించనుంది. రాత్రి నుంచి తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి వివిధ వాహనాల్లో ఊరేగించనున్నాడు. బ్రహ్మోత్సవాలు 12వ తేదీన చక్రస్నానంతో ముగియనున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేటు వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 4 నుండి 7వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రైవేటు వాహనాలు పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతిస్తారు. గరుడ సేవ సందర్భంగా, 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్‌లో ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు. అలాగే, 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12వ తేదీ వరకు కూడా ప్రైవేటు వాహనాలు పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతి పొందుతాయని పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను నిలిపివేసినట్లు ప్రకటించిన విషయం విదితమే..