Tirumala Darshan Tickets: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల డిసెంబర్ నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్ ద్వారా ఇవాళ ( సెప్టెంబర్ 18న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈసేవా టికెట్ల ఎలక్ర్టానిక్ డిప్ కోసం 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు అని తెలిపింది. అలాగే, అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ టికెట్లు, టోకెన్లను పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించిన వారికి టికెట్లు మంజూరు చేస్తారు.
Read Also: Ravi Basrur : సాలార్ తర్వాత రవి బస్రూర్‌కు అంతర్జాతీయ ఆఫర్లు..!
అయితే, సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చేయనుంది. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్లను కూడా కేటాయించనున్నారు.