Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

Ttd

Ttd

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన ప్రారంభించారు.. ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు (ఉల్లిపాయ వాడకుండా) చేసిన మసాలా వడలు వడ్డించారు టీటీడీ సిబ్బంది.. ఇక, రేపటి నుంచి అంచెలవారిగా సంఖ్యను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.. ఈ మసాలా వడలు పూర్తిస్థాయిలో రథసప్తమి నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది టీటీడీ.. మరోవైపు, మసాలా వడలు రుచికరంగా వున్నాయి అని.. తొలిసారి మసాలా వడలు అందిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి సందర్భంగా మసాలా వడలను పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా చర్యలు తీసుకుంటోంది టీటీడీ..

Read Also: Gujarat : వాట్ ఏన్ ఆర్ట్.. 4.5క్యారెట్ల వజ్రంపై ట్రంప్ చిత్రాన్ని తయారు చేసిన వ్యాపారి.. ధర తెలిస్తే షాకే

Exit mobile version