NTV Telugu Site icon

Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. భక్తులకు ఈవో కీలక సూచనలు

Ttd Eo

Ttd Eo

Tirumala Brahmotsavam 2024: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.. ఇక, రేపటి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. అయితే, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో శ్వామలరావు.. రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి వాహన సేవలు 7 గంటలకు ప్రారంభిస్తాం అని వెల్లడించారు.. పెద్దశేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహన సేవను సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభిస్తాం.. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని స్పష్టం చేశారు..

Read Also: Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ

మరోవైపు.. 7 లక్షల లడ్డూ ప్రసాదాలు నిల్వగా వుంచడంతో పాటు లడ్డూల పంపిణీ కోసం అదనంగా 11 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ఈవో శ్వామలరావు తెలిపారు.. 1,200 టీటీడీ విజిలెన్స్‌ సిబ్బందితో పాటు 3,900 మంది పోలీసులుతో భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.. తిరుమలలో 7 ప్రాంతాలలో 4 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం.. తిరుపతిలో 6 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుందన్నారు.. వైద్య సేవల కోసం అదనంగా 45 మంది డాక్టర్లు, 65 మంది మెడికల్ సిబ్బందిని నియమించామని వెల్లడించారు.. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏదైనా సమస్య వస్తే 155257 నెంబర్ తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, నిత్యం 400 ఆర్టీసీ బస్సుల ద్వారా 2 వేల ట్రిప్పులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. 21 రాష్ర్టాల నుంచి విచ్చేసిన 160 కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు.. గరుడ సేవ రోజున సాయంత్రం 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు వాహన సేవ వుంటుందన్నారు.. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్డు, నడకమార్గాలు తెరిచి వుంచుతాం అని వెల్లడించారు.. నాలుగు వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. భక్తుల సౌకర్యార్థం 28 ప్రాంతాలలో ఎల్ఈడి స్ర్కీన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు.