Site icon NTV Telugu

TTD Creates History: టీటీడీ కొత్త చరిత్ర.. ఈ ఏడాది రికార్డుస్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు

Ttd Devotees

Ttd Devotees

TTD Creates History: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చరిత్ర సృష్టించింది.. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించింది టీటీడీ.. 30 డిసెంబర్ 2025 నుంచి 8 జనవరి 2026వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు. ఈ కాలంలో భక్తుల సందడి విపరీతంగా ఉంది. టీటీడీ అధికారులు ప్రకటించిన దాని ప్రకారం.. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మొత్తం 7,09,831 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. రోజుకు సగటున సుమారు 75,000 – 90,000 మంది భక్తులు దర్శనం పొందినట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే, ఇంతకు మునుపటి గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం రికార్డు-స్థాయి దర్శనంగా భావిస్తున్నారు. ఇక, ఈ సమయంలో భక్తులు హుండీలో కూడా భారీగా కోట్లు విలువైన కానుకలు సమర్పించినట్లు సమాచారం బయటకు వచ్చింది.. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులలో సుమారు 7.9 లక్షలకు పైగా భక్తులకు తిరుమలలో జరిగి దర్శనాలు చూస్తే.. గత వాటితో పోలిస్తే ఇది కొత్త రికడ్ఆరు.. ఇప్పటి వరకు గత ఏడాది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 6.83 లక్షల మందే అత్యధికం.. కాగా, ఇప్పుడు ఆ రికార్డులు బ్రేక్‌ అయ్యాయి.. ఇక, హుండీ ద్వారా 40 కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పించారు భక్తులు..

Read Also: IP69K రేటింగ్‌, 200MP కెమెరా, Snapdragon 8 Elite చిప్ తో HONOR Magic8 Pro లాంచ్‌.. ధర ఎంతంటే..?

Exit mobile version