NTV Telugu Site icon

TTD: శ్రీవారి భక్తులకు గమనిక.. మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల మార్పు..

Ttd

Ttd

TTD: కలియు ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్య గమనిక.. వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలు ఖరారు చేసిన నేపథ్యంలో.. మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.. దీనికి సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

Read Also: Ponguleti Srinivasa Reddy: కాపలా కుక్కలు.. వేట కుక్కలుగా మారి భూ దోపిడి చేశాయి

అలాగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా డిసెంబర్‌ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.. ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీల్లో మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. డిసెంబర్‌ 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు పేర్కొంది.. ఇక, డిసెంబర్‌ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తామని.. అదే, రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ.. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఏర్పాట్లపై టీటీడీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది.. ఏర్పాట్లపై రివ్యూ సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో.. కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే..