Tirumala: తిరుపతి ఘటన తర్వాత సోషల్ మీడియాలో టీటీడీపై రకరకాల పోస్టులు పెడుతున్నారు.. అయితే, సోషల్ మీడియాలో టీటీడీపై తప్పువు వార్తలు ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఈవో శ్యామలరావుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. దర్శన టిక్కెట్లు తిరుపతిలోనే జారి చేస్తామని స్పష్టం చేశారు.. అయితే, మార్పులు చేయాల్సి వస్తే వచ్చే ఏడాదికి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. తొక్కిసలాట ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారణ వ్యక్తం చేశారు.. ఆ ఒక్క ఘటన మినహా మిగిలినవి అన్ని బాగా జరిగాయని తెలిపారు.
Read Also: Kite Festival: హైదరాబాద్లో ఘనంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్..
ఇక, టీటీడీలో సమన్వయం లోపం ఉందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు ఈవో శ్యామలరావు.. టీటీడీలో సమన్వయ లోపం లేదని స్పష్టం చేసిన ఆయన.. టీటీడీలో చైర్మన్ కీలకం.. పాలకమండలిలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు అమలు చేశాం అన్నారు. అయితే, బైరాగిపట్టెడలో భక్తులను అనుమతించే సమయంలో ప్రోటోకాల్ మేరకు విధానం పాటించలేదన్నారు.. చైర్మన్ కి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. ఆరు నెలలుగా ఎన్నో మంచి పనులు చేశాం.. వాటిని పక్కన పెట్టేసి తొక్కిసలాట ఘటన పైనే విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు.