TTD Budget 2026: రూ.5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్.. శ్రీవారి ఆదాయం ఎన్ని కోట్లు అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Budget 2026: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తసీఉకుంది.. ఇక, రూ. 5,456 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌లో శ్రీవారి ఆదాయం, వ్యయ కేటాయింపులు మరియు పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రత్యేకంగా నిలిచాయి.
* శ్రీవారి ఆదాయం కోట్లలో..
– హుండీ ద్వారా – 1,880 కోట్లు
– వడ్డీ ద్వారా – 1,205 కోట్లు
– ప్రసాదాల విక్రయం ద్వారా – 650 కోట్లు
– దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా – 310 కోట్లు
– ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా – 135 కోట్లు
– తలనీలాల విక్రయం ద్వారా – 175 కోట్లు
Also Read
ఈ విధంగా మొత్తం ఆదాయం సుమారు రూ. 5,456 కోట్లుగా అంచనా వేసింది టీటీడీ..
* టీటీడీ వ్యయ కేటాయింపులు (రూ. కోట్లు)
– ఉద్యోగుల జీతభత్యాలకు – 1,859 కోట్లు
– ముడి సరుకుల కొనుగోలుకు – 974 కోట్లు
– ఫిక్స్డ్ డిపాజిట్లకు – 700 కోట్లు
– ఇంజనీరింగ్ పనులకు – 475 కోట్లు
* టీటీడీ పాలకమండలి ముఖ్య నిర్ణయాలు
– విద్యాసంస్థల అభివృద్ధి పనులకు రూ. 118.8 కోట్లు కేటాయింపు.
– భక్తుల కోరిక మేరకు “శ్రీవారి ముడుపు” పథకం ప్రారంభం.
– రూ. 120 కోట్ల వ్యయంతో అత్యాధునిక అన్నప్రసాద సముదాయం నిర్మాణం.
– ఆలయాల నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలకు సడలింపు.
– ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ నిర్మాణానికి రూ. 20.8 కోట్లు కేటాయింపు.
– కోయంబత్తూర్, గౌహతి, బెలగావి, పాట్నా నగరాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టడం.
– వకులామాత ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభం.
– ఒంటిమిట్టలో శ్రీరాములవారి కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ.
– అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ. 8 కోట్ల వ్యయంతో బ్యాగేజ్ స్కానర్లు ఏర్పాటు.
* టీటీడీ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది పరిచారకులకు అర్చకులుగా పదోన్నతి.
– పార్వతీపురంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ. 14 కోట్లు కేటాయింపు.
– దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తుల భద్రతా పర్యవేక్షణ కోసం తిరుపిలో రూ. 10 కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు.
– తిరుమలలో అనుచితంగా రీల్స్ చిత్రీకరణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
అయితే, రూ. 5,456 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, భద్రతా చర్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ ముందుకు సాగుతోంది.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్‌తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!