Site icon NTV Telugu

Tirumala Tickets: హాట్ కేకుల్లా శ్రీవాణి దర్శన టికెట్లు విక్రయం.. కేవలం 7 నిమిషాల్లోనే రూ. 80 లక్షలు..

Tml

Tml

Tirumala Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈసారి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేసిన వెంటనే, భక్తులు భారీగా టికెట్లను కొనుగోలు చేశారు. టికెట్లు విడుదలైన 7 నిముషాల్లో ఆన్‌లైన్ లో కొనుగోలు చేశారు భక్తులు.. తక్కువ సమయంలోనే టికెట్లన్నీ అమ్ముడు పోవడంతో తిరుమల శ్రీవారి ఆలయం అదనంగా మరిన్ని టికెట్లను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: Tulsi Gabbard: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌ తులసిని ట్రంప్ పక్కన పెట్టారా? ఆ ఫొటోలు ఏం చెబుతున్నాయి?

ఇక, శ్రీవాణి దర్శన టికెట్ కొనుగోలుతో పాటు స్వామివారికి సుమారు 80 లక్షల రూపాయలు విరాళంగా భక్తులు సమర్పించారు. ఈ విరాళాలు ఆలయ హుండీలలో, ముందుగా నెలకొన్న విరాళ పద్ధతిలో అందజేయబడ్డాయి. ఈ విరాళాలు సేకరించడంలో భక్తుల ఉత్సాహం శ్రీవారి పట్ల ఏమాత్రం భక్తి ఉందో చూడొచ్చని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Exit mobile version