TTD: తిరుమలలో జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే వివిధ పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా బ్రేక్ దర్శనాలు ఉండవు.
అదేవిధంగా ఆగస్టు 22న పవిత్రోత్సవాల అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ సందర్భంగా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాల అంకురార్పణ, అలాగే సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలోనూ బ్రేక్ దర్శనాలు ఉండవని అధికారులు తెలిపారు. భక్తులు తమ యాత్రా ప్రణాళికలను ఇందుకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని సూచించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు..

