TG Venkatesh: బెయిల్ మీద విడుదలైన కవిత.. శశికళలా ఆవేశపడి బీజేపీ పెద్దలపై స్టేట్‌మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటే.. ఏ కేసీఆర్‌నో.. ఏ కేటీఆర్‌నో అరెస్ట్ చేసేవాళ్లమన్న ఆయన.. కానీ, కవిత చేసిన చెడుసావాసాల వల్లే ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నారు.. వాస్తవాలు తెలుసుకోకుండా శశికళల ఆవేశపడి పనికిరాని స్టేట్‌మెంట్లు ఇస్తే ఆమెకే నష్టమన్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అనే వార్తలు హాస్యాస్పదంగా ఉందన్నారు.. విలీనమే అంటే ఇంత తతంగం ఉండేది కాదన్నారు.
Read Also: Nadiminti Narasinga Rao: టాలీవుడ్లో విషాదం.. స్టార్ రైటర్ కన్నుమూత
మరోవైపు.. గతంలో మేం మంత్రులుగా పని చేసిన కాలంలో సేకరించిన సమాచారంతోనే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారని పేర్కొన్నారు టీజీ వెంకటేష్.. ఏపీలో కూడా ఇలాంటి అక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.. ఇక, శ్రీవాణి టిక్కెట్ ద్వారా వచ్చే డబ్బులకు అకౌంటబులిటీ ఉండేలా చూడాలని.. ఏదో దొంగ నోట్లు కొట్టినట్టు టికెట్లను ముద్రించి గతంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. అయితే, దానిపైన విచారణ కొనసాగుతుందని త్వరలోనే వాస్తవాలు బయటపడతాయన్నారు టీజీ వెంకటేష్..
Read Also: Kushi Sequel: ఖుషి సీక్వెల్ ఇక లేనట్లేనా..?
అభివృధ్ది అంటే చంద్రబాబు.. ఆయన కూడా చెరువులను కాపాడేందుకు కార్యక్రమం మొదలు పెట్టాలి.. ఆయన ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.. ఏపీలో కూడా పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని వెల్లడించారు. ఇక, కవిత మాట్లాడే భాష సరికాదని హితవుపలికారు టీజీ వెంకటేష్.. ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు గతంలో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని గుర్తుచేసుకున్నారు.. నా మీద పెట్టిన పది కేసులు కూడా ప్రూవ్ కాలేదన్నారు.. మరోవైపు.. ఏపీని అభివృధ్ది చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.. నూటికి నూరుపాళ్లు మా అబ్బాయి మంత్రిగా ముందుకు వెళ్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు టీజీ వెంకటేష్.