NTV Telugu Site icon

Heavy Rains: తిరుమలలో భారీ వర్షాలు.. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేత

Tirumala Rain

Tirumala Rain

వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అంతేకాకుండా.. పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు కూడా మూసివేయనున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు.

Read Also: Israel-Labnon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా 15 మంది మృతి

మరోవైపు.. తిరుపతి, కాళహస్తి, సత్యవేడు, నగరిలోని శివారు ప్రాంతాలోని ఇళ్ళలోకి వర్షపు నీరు భారీగా చేరింది. అటు.. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పలుచోట్ల కాజ్‌వేలపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల వల్ల ప్లాష్ ప్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సూచనలతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా.. రేపు తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రైవేటు స్కూలు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో 2500 హెక్టార్ల వరి పంట, 10 హెక్టార్ల కోత దశలోని వరి పంట, 4 హెక్టార్ల మొక్కజొన్న పంట‌‌‌లు దెబ్బతిన్నాయి.

Read Also: ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. ‘స్పెషల్-20’లోకి దిగ్గజ బ్యాట్స్‌మెన్

మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో కూడా వర్షం భారీగా కురుస్తోంది. తుఫాన్ కారణంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. భారీ వర్షాల ధాటికి వరి, బొప్పాయి, అరటి, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. రైల్వేకోడూరు, రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, నందలూరు, లక్కిరెడ్డిపల్లి, వీరబల్లి మండలాలలో 45 హెక్టార్లు వరి పంట దెబ్బతిన్నది. రైల్వేకోడూరు, పెనగలూరు మండలాలలో 10 ఎకరాలు బొప్పాయి, 2 ఎకరాలు అరటి, ఒక ఎకరా టమోటా పంట దెబ్బతిన్నది.