Site icon NTV Telugu

Flight On Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి గోపురంపై నుంచి వెళ్లిన విమానం.. టీటీడీ ఆగ్రహం

Tirumala

Tirumala

Flight On Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. అయినా తమ అయినా విజ్ఞప్తిని కేంద్ర విమానయాన సంస్థ పట్టించుకోవటం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొనింది.

Read Also: RC16 : రామ్ చరణ్ ‘పెద్ది’.. ఫస్ట్ లుక్ అదిరింది

అయితే, ఆగమశాస్ర్త నిభందనల ప్రకారం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమాన రాకపోకలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం టీటీడీ అధికారులు కోరారు. ఇవాళ కూడా శ్రీవారి ఆలయ గోపురంపై నుంచే వెళ్లిన విమానం.. గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపంపై నుంచే విమానం వెళ్లింది.. దీంతో విమానయాన శాఖ వైఖరిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర పౌర విమానయాన మంత్రి తిరుమలను నో-ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version