NTV Telugu Site icon

Minister Gottipati Ravi Kumar: విద్యుత్‌ ఛార్జీల పెంపునకు అదే కారణం.. తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం..

Gottipati Ravikumar

Gottipati Ravikumar

Minister Gottipati Ravi Kumar: కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడం వల్ల గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి.. అంతేకాదు 6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోంది.. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తాం.. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని స్పష్టం చేశారు.. ఒక్క మెగా వాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేదు అంటూ గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఆయన.. నూతన విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ యోజన పథకాన్ని ఏ విధంగా అందించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..

Read Also: Gold Price Today: పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?

మరోవైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆయన వ్యక్తిగతం.. మేమెక్కడా శ్రీనివాస్ ను విమర్శించడం లేదన్నారు మంత్రి గొట్టిపాటి.. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.. వైసీపీ నేతలు మాపై బురదజల్లాలని చూస్తున్నారన్న ఆయన.. కేంద్రంలో మమ్మల్ని దోషులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు అంటూ వైసీపీపై మండిపడ్డారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి అని స్పష్టం చేశారు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Show comments