Site icon NTV Telugu

CPI Narayana: జగన్ పై ఉన్న కోపాన్ని లడ్డూపై చూపించారు.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

Cpi Narayana

Cpi Narayana

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల అహంభావం వల్లే సులభంగా విజయం సాధించాల్సిన హర్యానాలో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. జాతీయ రహదారుల సర్వీస్ రోడ్డు కోసం రైతులు భూములు ఇచ్చారుని తెలిపారు. ఆ రైతులు తమ పొలాలకు వెళ్లకుండా రోడ్డుకు గోడ కడుతున్నారు.. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. మరోవైపు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయింది.. చంద్రబాబు దగ్గర మాయలు, మంత్రాలు లేవు.. అపుడే కూటమి ప్రభుత్వం హడావిడి చేయడం కరెక్ట్ కాదని నారాయణ పేర్కొన్నారు.

Read Also: Mohammed Siraj: డీఎస్పీగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరణ..

తిరుమల లడ్డు విషయంలో.. జగన్ పై ఉన్న కోపాన్ని లడ్డూపై చూపించారని సీపీఐ నారాయణ ఆరోపించారు. సనాతన ధర్మం రాజ్యాంగానికి విరుద్ధం.. రాజకీయంగా ఆర్ఎస్ఎస్‌కు ఉపయోగపడిందని తెలిపారు. మద్యంలో హోల్‌సేల్ లిక్కర్ మాఫియాగా జగన్ దోచుకున్నాడు.. ఇపుడు టీడీపీ, వైసీపీ సిండికేట్‌గా ఏర్పడి అరాచకం చేయబోతున్నారని అన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు.. ప్రభుత్వం మారింది.. తలకాయలు మారాయి.. అప్పుడు నల్లగడ్డం, ఇపుడు తెల్లగడ్డం వచ్చిందని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడా దొరకడం లేదని విమర్శలు చేశారు.

Read Also: Balakrishna: నాకు, నా భార్యకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారా!.. బాలకృష్ణ ఫన్నీ కామెంట్స్

Exit mobile version