NTV Telugu Site icon

Couple Stuck In Lift: తిరుపతి రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న దంపతులు.. ఊపిరాడక ఇబ్బంది

Couple Stuck In Lift

Couple Stuck In Lift

Couple Stuck In Lift: తిరుపతి రైల్వే స్టేషన్‌లోని లిఫ్ట్ లో ఇరుక్కున్నారు దంపతులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న సాయిబాబు దంపతులు.. మొదటి గేట్ వద్ద లిఫ్ట్ లో నుండి కిందకు దిగుతుండగా లిఫ్ట్‌ ఆగిపోయింది.. దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్‌లో తీవ్ర ఇబ్బంది పడ్డారు.. అయితే, టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేపట్టడంతో కిందకు దిగింది లిఫ్ట్‌.. దీంతో.. సురక్షితంగా బయటపడ్డారు లిఫ్ట్ లో ఇరుక్కున్న చీరాలకు చెందిన సాయిబాబు, రజని దంపతులు.. అయితే, లిఫ్ట్ పాడైతే ఎవరికి ఫోన్ చేయాలన్న ప్రాథమిక సమాచారం లేకపోవడంతో.. 108కు ఫోన్ చేశారు దంపతులు.. ఇక, రిజర్వేషన్ చేసుకుని చీరాలకు వెళ్లాల్సిన శబరి ట్రైన్ వెళ్లిపోవడంతో దంపతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.. మరోవైపు.. రెండు గంటలకు పైగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో బ్రీతింగ్ సమస్యతో ఇబ్బందిపడ్డారు సాయిబాబు భార్య రజని.. దంపతులకు ధైర్యం చెప్పిన ప్రయాణికులు.. మరోవైపు ధైర్యం చెబుతూ వచ్చారు.. మరోవైపు టెక్నీషియల్‌ మరమ్మతులు చేయడంతో.. ఆ దంపతులు సురక్షితంగా బయటకు రావడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, రైల్వే అధికారులు స్పందించలేదని తోటి ప్రయాణికులు మండిపడుతున్నారు..

Read Also: Papikondalu Tour: పాపికొండలు పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి ప్రారంభం..

Show comments