Site icon NTV Telugu

TTD: తిరుమలలో నగదు రహిత లావాదేవీలు.. టీటీడీ మరో ముందడుగు..

Tirumala

Tirumala

TTD: తిరుమలలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో అడుగు ముందుకేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్కి మెషిన్లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డూ ప్రసాదాలు పొందే సౌలభ్యం కల్పించింది. మరో వైపు అదనపు లడ్డూ నియంత్రణపై శ్రీవారి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Gujarat Rain: గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. స్కూళ్లకు సెలవులు

అయితే, ఇప్పటి వరకు వసతిగదుల కేటాయింపులో పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీల విధానాన్ని అమలు చేస్తోంది టీటీడీ.. మరోవైపు డొనేషన్స్‌ స్వీకరణలో నగదు రహిత లావాదేవీలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.. తాజాగా, శ్రీవారి ప్రసాదాల విక్రయంలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. దీని కోసం లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్కి మెషిన్లు ఏర్పాటు చేసింది టీటీడీ.. ఇప్పటి వరకు నగదు చెల్లించి.. అదనపు లడ్డూలు సైతం పొందే అవకాశం ఉండగా.. ఇప్పుడు కియోస్కి మెషిన్ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగిస్తోంది.. లడ్డూ కౌంటర్ల దగ్గర ఐదు కియోస్కి మెషిన్లు ఏర్పాటు చేసిన టీటీడీ.. ఎంబీసీ కార్యాలయం దగ్గర మరో మూడు మెషిన్లు పెట్టింది.. దీని ద్వారా క్యాష్‌ లెస్‌ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది.. కాగా, దర్శన టికెట్‌ ఉన్న భక్తులు కోరినన్ని లడ్డూలు పొందే అవకాశం ఉండగా.. దర్శన టికెట్‌ లేని భక్తులు ఆధార్‌ కార్డు ద్వారా రెండు లడ్డూలు పొందే సౌలభ్యం ఉన్న విషయం విదితమే.. అయితే, నగదు రహిత సేవల కోసం ఏర్పాటు చేసిన కియోస్కి మెషన్ల విధానం విజయవంతం అయితే.. మరికొన్ని చోట్ల కూడా ఇవి ఏర్పాటు చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది..

Exit mobile version