Site icon NTV Telugu

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు

Tirumala

Tirumala

ఈ నెల 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముందు రోజైన 30వ తేదీన సిఫారసు లెటర్లు స్వీకరించబడవని వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదల చేసింది.

Read Also: Lucknow Hotels Bomb Threats: పలు హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌

ఇదిలా ఉంటే.. తిరుమలలో నవంబర్‌లో ముఖ్యమైన కార్యక్రమాల లిస్ట్ విడుదల చేసింది టీడీపీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అందులో…..
నవంబర్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాలు:
నవంబరు 1న కేదారగౌరీ వ్రతం
నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర
నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర
నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ
నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం
10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
నవంబరు 12న ప్రబోధన ఏకాదశి
నవంబరు 13న కైశిక ద్వాదశి ఆ స్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి
నవంబరు 15న కార్తీక పౌర్ణమి
28న ధన్వంతరి జయంతి
29న మాస శివ రాత్రి

Exit mobile version