Site icon NTV Telugu

Anivara Asthanam: రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. భక్తులకు కీలక సూచనలు

Ttd

Ttd

Anivara Asthanam: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ఆణివార ఆస్థానం కార్యక్రమాని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపు ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.. రేపు సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పుష్పపల్లకి పై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. కాగా, ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు.. అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో.. ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది. చారిత్రక నేఫథ్యంలో పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుండి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమైయ్యేది. టీటీడీ ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారినపట్టికి.. ఆనాదికాలంగా వస్తున్న ఆచారాని అనుసరిస్తు నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తుంది టీటీడీ..

Read Also: Loose Motions: విరోచనాలు కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి..

ఆణివారి ఆస్ధానం సంధర్భంగా శ్రీరంగం దేవస్ధానం తరుపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్ద జీయర్ మఠంలో వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాల నడుమ జీయర్‌ స్వాములు, ఆలయ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో సర్వభూపాల వాహనంపై వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఆణివార ఆస్థానం రోజున సాధరణంగా స్వామి వారు సాయంకాలం సమయాన పుష్పపల్లకిపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. 5 నుంచి 7 టన్నుల పుష్పాలుతో అలంకరణ చేసిన పుష్పపల్లకి పై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు మాడ వీధులలో ఉరేగుతారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ. ఇక, భక్తుల రద్దీ దృష్యా సిఫార్సు లేఖలపై జారి చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

Exit mobile version