తిరుమల ఏడుకొండలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 26వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు మాఢ వీధులలో విహరించనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు..27వ తేదీ సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు..27వ తేదీ రాత్రి శ్రీవారికి పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు సీఎం జగన్. దీంతో భద్రతా ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా వున్నారు టీటీడీ భద్రతా అధికారులు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ CVSO నరసింహ కిషోర్ తెలిపారు.
Read Also: Srisailam Brahmotsavalu: దసరా బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం ముస్తాబు
5 వేల మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గ్యాలరీలోకి భక్తులు సులభతరంగా చేరుకోవడానికి ప్రత్యేకంగా క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హారతి పాయింట్ల వద్ద కూడా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుమలలో 15 వేల వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునే వెసులుబాటు వుందన్నారు.
తిరుపతిలో కూడా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసాం. వీఐపీల నుంచి సామాన్య భక్తులు వరకు టీటీడీ నిబంధనలు పాటించాలన్నారు. మరోవైపు ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ.. బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబర్ 1 నుంచి 5వ తేది మినహాయించి మిగిలిన తేదీలకు టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ..ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు.
రూ.100 కోట్ల వ్యయంతో యాత్రికుల వసతి సముదాయం, రూ.33 కోట్ల వ్యయంతో అదనపు క్యూ లైన్లు నిర్మాణానికి ఆమోదం తెలపనుంది పాలకమండలి. తిరుమలలో ఇవాళ 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు…సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది..నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,817 గా వుంది. తలనీలాలు సమర్పించిన వారు 33,350 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ.2.97 కోట్లుగా టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాబోయే రోజులలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుంది.
Read Also: Nanamuri Balakrishna: బాహుబలి రేంజ్ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?