NTV Telugu Site icon

‘పుష్పరాజ్‌’లుగా మారిన కస్టమ్స్‌ అధికారులు.. స్మగ్లింగ్‌ ఎలా చేశారంటే..?

ఇటీవల విడుదలైన పుష్ఫ సినిమాలు అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే పుష్పరాజ్‌ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కస్టమ్స్‌ శాఖలో పని చేస్తున్న ముగ్గురు పుష్పరాజ్‌ అవతారం ఎత్తారు. బాధ్యతయుతమైన పోస్టుల్లో ఉండి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు ఆ అధికారులు.. సీబీఐ చొరవతో ఆ అధికారులు గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఓ ముఠాతో కలిసి ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు. దీంతో కస్టమ్స్‌ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముగ్గురు కస్టమ్స్‌ అధికారులుతో పాటు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

ఎర్రచందనం దుంగలను పైపులంటూ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. నిందితులు సతీష్‌కుమార్‌, నజీబ్‌లకు కస్టమ్స్‌ శాఖలో సూపరిండెంట్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్‌, అనంత పద్మనాభరావులతో పాటు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రవీందర్‌ పవార్‌పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అయితే ఏపీలోని రాయలసీమ నుంచి స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.