Site icon NTV Telugu

విద్యుత్‌ బకాయిలపై తెలుగు రాష్ర్టాలకు మోడీ సర్కార్‌ షాక్‌

విద్యుత్‌ బకాయిల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ స‌ర్కార్ ఊహించ‌ని షాక్ ఇచ్చింది. విద్యుత్‌ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నెలకొన్నవివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాసినట్లు చెప్పారు.

https://ntvtelugu.com/double-layer-masks-should-be-used-to-combat-omicran

విద్యుత్‌ సరఫరా ఒప్పందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగింది. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పొందిన విద్యుత్‌కు తెలంగాణ చెల్లింపులు చేశామని తెలిపింది . విద్యుత్‌ చార్జీలకు సంబంధించి తెలంగాణ బకాయిపడ్డ సొమ్ములో అసలుపై ఎలాంటి వివాదం లేదు. అసలుపై విధించిన వడ్డీ విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైందని మంత్రి తెలిపారు. ఈ వడ్డీ చెల్లింపుపై పవర్‌ పర్చేజ్‌ ఒప్పందంలోని షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సామరస్యంగా రాజీ కుదుర్చోకోవాలని మంత్రి వెల్లడించారు. విద్యుత్‌ బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ఉభయ రాష్ట్రాలు వివాదాన్ని పరిష్కరించుకోవడమే ఉత్తమ మార్గమని తెలిపారు.

Exit mobile version