NTV Telugu Site icon

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..

Tirumala

Tirumala

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గత రెండు రోజుల క్రితం కొంత తగ్గినట్లు కనిపించినా మళ్లీ నిన్నటి నుంచి రద్దీ పెరిగింది. ఇక, శుక్ర, శని, ఆదివారాలు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ లో ఎలాగూ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే కొనసాగుతుంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా మరిన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఈరోజు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Read Also: Finger ice cream: ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ఎవరిదో కనుక్కున్న ఫోరెన్సిక్ నిపుణులు..

అయితే, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 60, 782 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక, 30, 100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హూండీ ఆదాయం 3. 53 కోట్ల రూపాయలు వచ్చింది.