Site icon NTV Telugu

AP Tax Payers: పన్ను చెల్లింపు దారుల సంఖ్య పెరిగింది.. మూడేళ్లల్లో 18 లక్షల మంది పెరిగారు

Ap Tax Payers

Ap Tax Payers

AP Tax Payers: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. గత 5 ఏళ్లుగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లల్లో అయితే కంగా 18 లక్షల మంది అదనంగా పన్ను చెల్లింపుదారులుగా మారారు. ఏపీలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరుగుతోందని ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. అలాగే సర్కార్‌కు పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత మూడేళ్లలో ఏపీలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 18 లక్షల పెరిగిందని ప్రకటించింది. ఏ రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ పెరుగుదల లేదని నివేదికలో పేర్కొంది. 2015-20 మధ్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లించే వారి సంఖ్య సుమారు 3.81 కోట్లుగా ఉండగా.. ఆ సంఖ్య 2020-2023 మధ్య కోటి మాత్రమే. కానీ ఏపీలో మాత్రం గత ఐదు సంవత్సరాల్లో 5 లక్షల మంది ఆదాయపు పన్ను చెల్లించేవారు పెరిగినట్లు నివేదికలో వెల్లడించారు.

Read also: Hyderabad Road Accident: బైక్‌ ఢీ కొనడంతో పూర్తిగా దగ్ధమైన బస్సు.. ఓ వ్యక్తి మృతి!

ఆంధ్రప్రదేశ్ లో గత ఎనిమిది ఏళ్లలో 23 లక్షల మంది పన్ను చెల్లించేవారు పెరిగారని ఎస్‌బీఐ నివేదిక చెబుతోంది. గత 3 సంవత్సరాల్లో ప్రజల ఆదాయం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. ఆదాయం పెరగడంతో.. తక్కువ ఆదాయం ఉన్నవారు మధ్య తరగతిలోకి, మధ్యతరగతిలో ఉన్నవారు కాస్త ఎగువ మధ్యతరగతి ఆదాయంలో చేరుతున్నారని పేర్కొంది. 2023లో ఆదాయపు పన్ను దాఖలు చేసిన రాష్ట్రల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు అగ్రభాగాన నివేదిక స్పష్టం చేసింది. 2014లో మధ్యతరగతి సరాసరి ఆదాయం రూ.4.4 లక్షలు ఉండగా.. అది కాస్త 2023 నాటికి రూ.13 లక్షలకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2047 నాటికి సగటు ఆదాయం కాస్త రూ.49.7 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో రూ.5 లక్షల ఆదాయం కేటగిరీ నుంచి రూ. 10 లక్షల ఆదాయ కేటరిగిరిలో పన్ను చెల్లించే వారు 8.1 శాతం పెరిగారు. రూ. 10 లక్షల ఆదాయ కేటగిరి నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరికి వెళ్లిన వారు 3.8 శాతంగా ఉన్నారు. కోటికి పైగా ఆదాయ కేటగిరిలో 0.02 శాతం పెరిగారని నివేదిక పేర్కొంది.

Exit mobile version