Site icon NTV Telugu

Janasena Chief: ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది..

Pawan

Pawan

Janasena Chief: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది అని ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని పేర్కొన్నారు. అలాగే, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తున్నట్లు రెండో సంతకం పెట్టారని చెప్పుకొచ్చారు. ఇక, సామాజిక పింఛన్లు 3 వేల రూపాయల నుంచి 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం మూడో సంతకం పెట్టారని జనసేన అధినేత, మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Read Also: Pushpa 2 : డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్..?

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ సీఎం చంద్రబాబు నాలుగో సంతకం చేశారని మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే, యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ పై అయిదో సంతకం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని ఎక్స్ వేదికగా ఏపీ రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

Exit mobile version