NTV Telugu Site icon

పట్టాభిరామ్‌ మాట్లాడింది దారుణమైన భాష : డీజీపీ

ఏపీలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ మాట్లాడుతూ.. పట్టాభిరామ్‌ మాట్లాడింది దారుణమైన భాష అన్నారు. అంతేకాకుండా పట్టాభిరామ్‌ వ్యాఖ్యలు చేసిన తరువాత నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. చట్టబద్దమైన పదవుల్లో ఉన్న వారిని తిట్టకూడదన్నారు.

పట్టాభిరామ్‌ నోరు జారి మాట్లాడిన మాటలు కాదని, ఒక పార్టీ ఆఫీసు నుంచి మాట్లాడించారన్నారు. ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. దీనితో పాటు నిన్న 5.03 నిమిషాలకు తెలియని నెంబర్‌ నుంచి తనకు వాట్సప్‌ కాల్‌ వచ్చినట్లు తెలిపారు. శబ్దాలు అధికంగా ఉండడం వల్ల ఆ కాల్ మాట్లాడలేకపోయానని తెలిపారు.