NTV Telugu Site icon

బాలికను బలిగొన్న ఈదురు గాలులు

అండమాన్‌ లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారింది. అయితే ఈ తుఫాన్‌ పేరు జవాద్ తుఫాన్‌గా నామకరణం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశాలపై ఈ జవాద్‌ తుఫాన్‌ ప్రభావం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదరు గాలుల ధాటికి ఓ కొబ్బరి చెట్టు నేలకొరిగింది. ఆ కొబ్బరి చెట్టు ఓ బాలికపై పడిపోవడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఒక్కసారి ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.