గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ల రేట్లపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుపై లేదంటూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ హైకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
పాత రేట్లు వర్తిస్తాయని హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాన్ని హైకోర్టు డిస్టిబ్యూటర్లకు ఇచ్చింది. అయితే టికెట్ల ధరల విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేపు టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు సమాచారం.