రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినేట్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ విషయం పై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్ నడుస్తుంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీతో పాటు దాని ఇచ్చిన జీవోలను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
Read Also: ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: బండి శ్రీనివాస్, ఏపీ జేఏసీ ఛైర్మన్
Also Read
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
అంతే కాకుండా సమ్మె చేయడానికి కూడా సిద్ధం అని ప్రకటించారు .ఈ నెల 21 న సమ్మె నోటీసులు కూడా ఇవ్వనున్నారు. దీంతో పీఆర్సీ పై రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే సినిమా టికెట్ల ధరల విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి, సీఎం జగన్ సమావేశం అయిన విషయం తెల్సిందే. ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీకి అనుకూలం నిర్ణయం వస్తుందని చిరంజీవి కూడా ప్రకటించారు. దీంతో సినిమా టికెట్ల ధరల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఏకంగా 12 వేల కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో కరోనా వ్యాప్తి పై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అంతే కాకుండా పాఠశాలల కొనసాగింపు పైనా నిర్ణయం వెలువడే అవకాశాలు లేకపోలేదు. ఓ వైపు ఉద్యోగ సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజావార్తలు
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..