Site icon NTV Telugu

Tenth Paper Leak: మొన్న తెలుగు.. నిన్న హిందీ.. నేడు ఇంగ్లీష్..!!

Tenth Paper Leak

Tenth Paper Leak

ఏపీలో పదో తరగతి పరీక్షల సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తొలిరోజు తెలుగు, రెండో రోజు హిందీ పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడో రోజు నంద్యాల జిల్లా నందికొట్కూరులో టెన్త్ పేపర్ లీక్ అయ్యిందని వార్తలు హల్‌చల్ చేశాయి. గాంధీ మెమోరియల్ హైస్కూల్ నుంచి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. స్కూల్ అటెండర్ ద్వారా పేపర్ లీకైందని వార్తలు రావడంతో వెంటనే విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు, నంద్యాల డీఈవోలు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

ఇంగ్లీష్ పరీక్ష ప్రారంభమైన 8 నిమిషాలకు గ్రూప్‌లో క్వశ్చన్ పేపర్‌ను ఓ వాట్సాప్ గ్రూప్‌లో కొందరు వ్యక్తులు షేర్ చేశారు. దీంతో గాంధీ మెమోరియల్ స్కూలులో కర్నూలు డీఈవో రంగారెడ్డి విచారణ జరుపుతున్నారు. స్కూల్ సిబ్బంది, ఇన్విజిలేటర్లు, డిపార్ట్ మెంటల్ చీఫ్, సూపరింటెండెంట్‌ను విచారిస్తున్నారు. పరీక్ష ముగిసినా గాంధీ మెమోరియల్ స్కూల్ నుంచి విద్యార్థులను అధికారులు బయటకు పంపలేదు. అయితే పేపర్ లీక్ అంశాన్ని విద్యాశాఖ ఖండించింది. పేపర్ బయటకు రావడం మాల్ ప్రాక్టీసు మాత్రమే అని.. లీక్ కాదని అధికారులు అంటున్నారు. కాగా టెన్త్ పేపర్ లీక్ అంశంపై వదంతులు వ్యాప్తి చేసే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

SSC Question Paper Leak: టెన్త్‌ పేపర్ లీక్ కాలేదు… అది కుట్ర..!

Exit mobile version