NTV Telugu Site icon

Andhra Prasesh: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. రంగంలోకి స్క్వాడ్స్

Exams

Exams

ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయితే సహేతుక కారణాలతో లేటుగా వస్తే అనుమతించాలని నిర్ణయించారు.

పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షల్లో ఎలాంటి చూచిరాతలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా 156 ఫ్లైయింగ్‌, 292 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను అధికారులు రంగంలోకి దింపారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఏడు పేపర్లు మాత్రమే పరీక్షలు రాయనున్నారు.

Woman Protest: కృష్ణా నదిలో మహిళ దీక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!