NTV Telugu Site icon

Janasena : పిఠాపురం జనసేన సభ వద్ద ఉద్రిక్తత..

Janasena 1

Janasena 1

Janasena : పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న జనసేన మొదటి సభ. అందుకే భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సభ వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సభ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ వద్దకు వచ్చిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వెళ్లాలని ప్రయత్నించారు. ఇంతలోనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బాలరాజును అడ్డుకున్నారు.

Read Also : Human Trafficking : వరంగల్‌లో కిలేడీ గ్యాంగ్ అరాచకాలు.. భయాందోళనలో తల్లిదండ్రులు

డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వీఐపీలు, వీవీఐపీలు వెళ్తారని.. కాబట్టి రాజావారి ద్వారం నుంచి వెళ్లాలంటూ బాలరాజుకు సూచించారు. దీంతో బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేను అని.. తాను ఆ ద్వారం నుంచే వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇరువురికి వాగ్వాదం చోటుచేసుకుంది. డొక్కా సీతమ్మ ద్వారంలో అడ్డుగా ఉన్న బారికేడ్లను తోసుకుంటూ ఎమ్మెల్యే, అతని అనుచరులు లోపలకు వెళ్లారు. దీంతో పోలీసులు, సెక్యూరిటీ కూడా సైలెంట్ కావడంతో గొడవ సద్దుమణిగింది.