ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు ఫిర్యాదు దారులు. బాధితుల దాడితో తలుపులు మూసేశారు పోలీసులు. పెళ్ళైన మూడు నెలలకే వరకట్న వేధింపులతో పోలీసులను ఆశ్రయించింది ఒక మహిళ. అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న భర్త రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. అయితే, నిన్నటి నుండి ఐశ్వర్య కనిపించకపోవటంతో పోలీసులని ఆశ్రయించారు ఆమె తల్లితండ్రులు. దీంతో భర్త రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Read Also: Airbus Beluga : హైదరాబాద్లో ల్యాండైన ఎయిర్ బస్ బెలూగా
రాజ్ కుమార్ అరెస్ట్ వార్త తెలిసి పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు గొడవకు దిగాయి. పోలీసులు పట్టించుకోక పోవటం వల్లే ఐశ్వర్య కనిపించటం లేదని ఆమె తల్లి తండ్రులు ఒక పక్క ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో రాజ్ కుమార్ తప్పేం లేదని వారి కుటుంబ సభ్యులు మరో పక్క పోలీసు స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. ఆగ్రహంతో వున్న మహిళలకు , పోలీసులకు మధ్య తోపులాటతో స్టేషన్ గేట్లు మూసేశారు సిఐ , ఎస్సైలు. తమ కూతురు జాడ చెప్పాలంటూ స్టేషన్ ముందు బైఠాయించారు ఐశ్యర్య తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ ప్రజలు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
Read Also: World Bank About India: ఇండియా గురించి ‘ప్రపంచం’ ఏమంటోంది?
గెద్దనాపల్లి స్కూళ్ళో ఫుడ్ పాయిజన్
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 17 మంది స్టూడెంట్స్ కి అస్వస్థత కలిగింది. బిర్యానీ సరిగా వండకపోవడం వలన అస్వస్థతకు కారణంగా వైద్యులు ప్రాధమికంగా నిర్ధారించారు. దీంతో ఉపాధ్యాయులని నిలదీశారు తల్లిదండ్రులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విద్యార్థులకి చికిత్స అందచేస్తున్నారు.