Telugudesam Party: లోకేష్ జూమ్ మీటింగ్ లో చొరబాటుపై సీఐడీకి కంప్లైంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ట్వీట్ల వార్ తో పాటు కొత్త వివాదాలు తెరమీదకు వచ్చాయి. ట్వీట్లతో వైసీపీ-టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే.. తాజాగా జూమ్ మీటింగ్ లలో అధికార పార్టీ నేతలు చొచ్చుకురావడంపై వివాదం రేగింది. దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. టీడీపీ జూమ్ కాన్ఫరెన్సులో వైసీపీ నేతలు జొరబడ్డ ఎపిసోడుపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగులోకి మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే వంశీ సహా వైసీపీ నేతలు జొరబడడంపై సీఐడీ చీఫ్ సునీల్ కుమారుకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.
ఫిర్యాదులో వర్ల రామయ్య అనేక అంశాలు ప్రస్తావించారు. రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు.కొడాలి నాని, వంశీ, కొత్తపల్లి రజనీ, దేవేందర్ రెడ్డిలు వేరే వారి పేర్లతో లోకేష్ జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు లోకేష్ తో గతంలోనే పూర్తిగా వైరుధ్యం కలిగి ఉన్నారు. నాని, వంశీ చర్యలు నేరపూరిత కుట్రగా కనిపిస్తున్నది. గొడవలు పెట్టాలని ప్రయత్నించిన నాని, వంశీలపై నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి.పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులతో లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డారు.కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్‌లోకి చొరబడ్డారు.అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.రాజకీయంగా గతంలో సైతం వీరు అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు.నేరపూరిత కుట్రతో జూమ్ మీటింగులోకి అక్రమంగా చొరబడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు వర్ల రామయ్య.
Breaking News : లోకేశ్ జూమ్ మీటింగ్‌లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?