ఏపీలో మండు వేసవిలో కరెంట్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అప్రకటిత కరెంట్ కోతలపై టీడీపీ నేతలు పలు చోట్ల ధర్నాలకు దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని కురగల్లు గ్రామంలో బుధవారం రాత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తుండగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన నేరుగా లాంతర్ చేతబట్టి నిరసన తెలిపారు.
మరోవైపు ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో లాంతర్లు, కాగడాలతో టీడీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా కరెంట్ కోతలను నిరసిస్తూ సెల్ ఫోన్ వెలుతురులో మీటింగ్‌ను కొనసాగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వ్యవసాయానికి మోటార్లు పెడుతున్నారని.. భవిషత్తులో ఉచిత విద్యుత్ ఉంటుందో.. పోతుందో తెలియదని ఎద్దేవా చేశారు. రోజులో సగం సమయం కరెంటు తీసేస్తే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సీఎం ఢిల్లీ వెళ్లి అప్పు ఇవ్వండని అడిగారంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే జనాలు తరిమి తరిమి కొడతారని విమర్శించారు.
https://ntvtelugu.com/ap-government-presenet-volunteer-awards-from-april-7th/