దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అరుదైన సమావేశం జరిగింది.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా మీట్ అయ్యారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన నేతలు.. ఇలా భేటీ అయ్యారు.
Read Also: Gannavaram Politics: గన్నవరం టికెట్ ఆయనకే.. అధిష్టానం క్లారిటీ..!
మరోవైపు ఇప్పటికే పలు దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించారు ఇద్దరు తెలుగు నేతలు.. ఆయా సంస్థల చీఫ్‌లు, ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు అవుతూ.. తమ దగ్గర ఉన్న అనుకూల పరిస్థితులను వివరించారు.. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇప్పటికే పలు ఒప్పందాలు కూడా చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక, విదేశీ గడ్డపై ఏపీ సీఎం జగన్‌తో కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలు షేర్ చేశారు మంత్రి కేటీఆర్.. ‘నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది..’ అని రాసుకొచ్చారు మంత్రి కేటీఆర్.. అయితే, ఇద్దరు నేతల మధ్య విదేశీ గడ్డపై ఎలాంటి చర్చ జరిగింది అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Had a great meeting with my brother AP CM @ysjagan Garu pic.twitter.com/I32iSJj05k
— KTR (@KTRTRS) May 23, 2022