Site icon NTV Telugu

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళిసై సౌందరరాజన్‌ దంపతులు.. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన తెలంగాణ గవర్నర్.. ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో.. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు… ప్రజలందరూ సంతోషంగా వుండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. కాగా, తిరుమలలో వైకుంఠ ఏకాదశిరోజు శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.. 22వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also: సంక్రాంతి సంబరాల్లో పందుల పోటీలు.. ఎగబడ్డ జనం..

Exit mobile version