Site icon NTV Telugu

FRO Suspicious Death: తిరుపతిలో కరీంనగర్ ఫారెస్ట్ రేంజర్ అనుమానాస్పద మృతి

FRO

Collage Maker 25 Nov 2022 09.39 Pm

భద్రాద్రి కొత్తగూడెంలో గుత్తికోయల చేతిలో ఓ అటవీ అధికారి దారుణ హత్యకు గురైన ఘటన మరువక ముందే తిరుపతిలో ఓ అటవీ అధికారి మరణించడం కలకలం రేపుతోంది. అలిపిరిలో కరీంనగర్ కి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆకస్మిక మృతి వార్త సంచలనంగా మారింది. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తూ గుండెపోటుకు గురయ్యాడో భక్తుడు. భక్తుడిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతిచెందడం విషాదం నింపింది. భక్తుడు కరీంనగర్ జిల్లాకు చేందిన ఎఫ్ఆర్వో సాయి ప్రసాద్ గా గుర్తించారు టీటీడీ విజిలెన్స్ అధికారులు.

Read Also: Mukeshkumar Meena: పక్కాగా ఓటర్ల నమోదు.. అర్హులందరికీ ఓటు హక్కు

భక్తుడి మృతి దేహాన్ని శవ పరీక్షల నిమిత్తం రుయాకు తరలించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాయి ప్రసాద్ స్వస్థలం కోరుట్ల అని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ డిప్యూటీ రేంజ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధికారి సాయి ప్రసాద్ కు 7ఏళ్ల వయసు ఉన్న కొడుకు, ఐదేళ్ల వయసు ఉన్న పాప ఉన్నారు. ఇటీవల నూతన జోనల్ విధానంలో భాగంగా ఆయన మహదేవపూర్ కు బదిలీ అయ్యారు. గతంలో వేములవాడ సమీపంలోని రుద్రంగిలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేశారు శివ ప్రసాద్. దైవదర్శనానికి వెళ్ళి ఇలా జరగడంపట్ల విషాదం నెలకొంది. ఈ ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Read Also: Shardul Thakur: ఒక్క ఓవర్‌తో టీమిండియాను నిండా ముంచిన ఠాకూర్

Exit mobile version