అక్రమార్కుల ఆలోచనలు మామూలుగా వుండవు. తాము చేసే అక్రమ వ్యాపారం ఎవరికంటా పడకుండా చాలా జాగ్రత్త పడతారు. అల్లు అర్జున్ సినిమా పుష్ప తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లు తగ్గేదేలే అంటున్నారు. పుష్ప సినిమా మాదిరి శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఎర్రచందనం రవాణా దారులు, ఎర్ర చందన దుంగలను సరిహద్దులు దాటించేస్తున్నారు.. అక్కడ పాల వాన్ లో అయితే ఇక్కడ పశువుల మేత మాటున ఎర్రదుంగలు ఊళ్లు దాటేస్తున్నాయి. ఒడిశా ప్రాంతం నుండి పలాస మీదుగా విశాఖపట్నం ఎర్రచందనం దుంగలను తరలించే క్రమంలో టెక్కలి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు టెక్కలి జాతీయ రహదారి పై నిఘా పెట్టారు టెక్కలి పోలీసులు.
Read ALso: Bharat Jodo Yatra: మరికొన్ని గంటల్లో షురూ.. షెడ్యూల్ ఇదే!
ఒక ఐచర్ వాహనంలో పశువుల తవుడు మాటున అక్రమ ఎర్రచందనం రవాణాను గుర్తుంచిన టెక్కలి పోలీసులు జాతీయ రహదారిపై ఆపి దర్యాప్తు చేపట్టారు. సుమారు 51 తవుడు బస్తాలు మాటున ఐచర్ వాహనంలో సగం లోడ్ ఎర్ర చందనం దుంగలు ఉండడంతో అవాక్కయ్యారు పోలీసులు. సుమారు లక్షల్లో ఉన్న ఈ ఎర్రచందనం ఎక్కడ నుండి వస్తుంది, ఎవరి ద్వారా రవాణా జరుగుతుంది అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నెల్లూరు, తిరుపతి కి చెందిన ఇద్దరి నిందితులతో పాటు ఇంకో పది మంది సూత్రధారులు ఈ అక్రమ రవాణాలో పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఎప్పటి నుండో ఎర్ర చందనం అక్రమ రవాణా జరుగుతుందని, కనీసం నిఘా కొరవడిందంటూ స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు.
Read ALso: Nuts and your heart: రోజూ గుప్పెడు పల్లీలు తింటే గుండె పదిలం