NTV Telugu Site icon

TDP Wins Election Unanimous: వైసీపీకి ఊహించని షాక్..! హోం మంత్రి ఇలాకాలో ఎగిరిన టీడీపీ జెండా..!

Tdp Wins

Tdp Wins

తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది… హోంశాఖ మంత్రి తానేటి వనితకు తన సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది… ఆమె సొంత నియోజకవర్గం కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది… అసలు వైసీపీ అభ్యర్థులు పోటీలో కనిపించకుండా పోవడం చర్చగా మారింది.. మొత్తంగా.. 11 డైరక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు టీడీపీ అభ్యర్థులు… ఆ పార్టీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను చైర్మన్‌గా ఎన్నుకున్నారు డైరెక్టర్లు.. దీంతో, వరుసగా ఐదవసారి బ్యాంక్ చైర్మెన్ గా భాద్యతలు తీసుకున్నారు శివరామకృష్ణ..

Read Also: Tollywood: షూటింగ్స్ బంద్.. ఇట్స్ అఫీషియల్

అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని ముందుగానే శ్రేణులకు సూచించారు హోంమంత్రి తానేటి వనిత.. త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళికలు వేశారు.. అయితే, తెలుగుదేశం నాయకుల వ్యూహాలను ఛేదించడంలో వనిత టీమ్‌ విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంలో పార్టీ శ్రేణులపై తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది… మరోవైపు, కొవ్వూరులో అర్బున్ ఎన్నికల వ్యవహారం వైసీపీ అధిష్టానం ఆరా తీసినట్టుగా చెబుతున్నారు.. కాగా, వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ 2లో మంత్రి పదవి దక్కించుకున్నారు తానేటి వనిత.. కానీ, తన ఇలాకాలో ఇలా జరగడంతో ఆమెకు షాక్‌ తగిలినట్టు అయ్యింది.