NTV Telugu Site icon

ఏపీలో టీడీపీ సాధ‌న దీక్ష‌లు… కోవిడ్ బాధితుల‌ను అదుకోవాల‌ని డిమాండ్‌…

ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  క‌రోనా కార‌ణంగా వేలాది మంది ఇప్ప‌టికే మృతి చెందారు. ల‌క్ష‌లాది మంది క‌రోనా బారిన ప‌డి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని డిమాంట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ టీడీపీ సాధ‌న దీక్ష‌ల‌కు పిలుపునిచ్చింది.  ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో టీడీపీ నేత‌లు సాధ‌న దీక్ష‌లు చేయ‌బోతున్నారు.  టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌గిరిలోని పార్టీ ఆఫీస్‌లో నిర‌స‌న దీక్ష చేస్తున్నారు.  ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు సాధ‌న దీక్షలో పాల్గొంటారు.  

Read: మెగా బాణీలు వాయించే పనిలో థమన్! ‘చిరు 153’ షురూ…