జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండున్నరేళ్ల పాలనలో వైఎస్ జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో అంటూ కామెంట్ చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు… శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్టేషన్ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు , మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ విడుదలయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. సీఎం జగన్ ప్యాలెస్ దాటి బయటకు అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.. తక్షణమే నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరారు.. ఇక, రెండున్నరేళ్ల పాలనలో జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో అంటూ వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ.. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి… అదే డబ్బు నవరత్నాల కోసం ఖర్చు చేస్తున్నారని.. ఇదంతా పెద్ద స్కామ్… ఆర్ధిక నేరం అన్నారు.
వైఎస్ జగన్ సీఎం పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.. టీడీపీని చూసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం జగన్ భయపడుతున్నారన్న ఆయన..మా నిరసనలను పోలీసుల చేత అడ్డుకోవడమే అందుకు నిదర్శనం అన్నారు. మమ్మల్ని అడ్డుకునే బదులు పోలీసులు లా అండ్ ఆర్డర్ పై దృష్టిపెడితే రమ్య వంటి ఘటనలు జరగవు కదా ? అని సూచించిన ఆయన.. ఆర్ధిక ఉగ్రవాదులు ఎంతమంది వచ్చినా… టీడీపీ పోరాటం కొనసాగుతుందన్నారు.. ఇక, వైఎస్సార్ కండువా కప్పుకున్న నేతలకు కోవిడ్ నిబంధనలు వర్తించవా ? ప్రశ్నించారు. తండ్రి సమయంలో సంపాదించిన డబ్బు వైఎస్ జగన్ కు సరిపోలేదని.. అందుకే జనం నుంచి దోచుకుంటున్నారని.. ప్రజావ్యతిరేక పాలనకు అతి త్వరలోనే ముగింపు కార్డు పలుకుతాం అన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!